విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. ఈ భారీ బడ్జెట్ చిత్రం (జూలై 31) నేడు విడుదలయింది. ప్రజంట్ టాక్ మటుకు పాజిటీవ్ గా ఉన్నప్పటకి.. ముందు ముందు కలెక్షన్ లు ఎలా ఉంటాయో చూడాలి. అయితే గతంలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాల్సిందే. ఇక భాగ్యశ్రీ బోర్సే ది కూడా ఇదే పరిస్థితి .. ‘మిస్టర్ బచ్చన్’తో తెరంగేట్రం చేసిన ఈ ముంబై బ్యూటీకి తొలి చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో కెరీర్ మొదటి దశలోనే ఎదురు దెబ్బ తగిలింది. కానీ గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Also Read : War2: ‘వార్2’ నుండి రోమాంటిక్ సాంగ్ రిలీజ్.. బోల్డ్‌గా రెచ్చిపోయిన హృతిక్ – కియారా
అందం, యూత్‌ఫుల్ లుక్, పెద్ద హీరోయిన్‌లను గుర్తు చేసే హావభావాలు.. ఇలా ఆమెపై ఇప్పటికే కొంత క్రేజ్ ఏర్పడింది. అంతేకాదు, రామ్ పోతినేనితో ‘ఆంధ్రా కింగ్’, అఖిల్ ప్రాజెక్ట్ ‘లెనిన్’లోనూ భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శ్రీలీల స్థానాన్ని భవిష్యత్తులో భర్తీ చేయగలదని ఇండస్ట్రీ టాక్. శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ చేయడంతో, తెలుగు మార్కెట్‌లో భాగ్యశ్రీకి గ్యాప్‌ను నింపేస్తోంది. ఒక్క హిట్ చిత్రంతో పూజా హెగ్డే, శృతిహాసన్ లాంటి హీరోయిన్లు స్టార్ స్టేటస్ అందుకున్నట్లే, ‘కింగ్డమ్’ హిట్ అయితే భాగ్యశ్రీ పేరును బిగ్ లీగ్‌లో చూడవచన్న మాట. ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా భాగ్యశ్రీ తిరుమల శ్రీవారి దర్శనం తీసుకోవడం, మీడియా ఇంటరాక్షన్స్‌లో చురుగ్గా పాల్గొనడం చూసినవారంతా ఆమె కెరీర్‌పై ఎంతో దృష్టి పెట్టిందని చెప్పుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ క్రియేషన్స్ వంటి భారీ బ్యానర్స్‌లో నటించడమంటే ఏ చిన్న విషయం కాదు. ఈ సినిమా హిట్ అయితే ఆమె టాలీవుడ్‌లో కొత్త గ్లామర్ క్వీన్‌గా నిలవడం ఖాయం.