Barrelakka: సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చు. టిక్ టాక్, రీల్స్ చేస్తూ సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు అలా ఫేమస్ అయిన ఒక అమ్మాయి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడింది. ఇప్పటికే ఆమె ఎవరో తెలిసిపోయి ఉంటుంది. “హాయ్ ఫ్రెండ్స్.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. మా అమ్మకు చెప్తే నాలుగు బర్రెలను కొనిచ్చింది.. బర్రెలను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్..” శిరీష అనే యువతీ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే.. ఆ వీడియో అప్పటిలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క వీడియోను పట్టుకొని ప్రభుత్వాలను ఏకిపారేసిన జనాలు కూడా లేకపోలేదు. అప్పటినుంచి శిరీష కాస్త బర్రెలక్క గా మారిపోయింది. అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. డిగ్రీ చదివిన శిరీష జాబ్ లేక.. రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది.
Bhagavanth Kesari: బాలయ్య సినిమాకు సడీచప్పుడు లేదేంటీ.. ?
ఇక ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి అందరికి షాక్ ఇచ్చింది. తనను గెలిపించమని ప్రజలను వేడుకుంటుంది. ఇక ఈ మధ్యనే ఆమెపై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే బర్రెలక్క.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ప్రజలకు తెలియజేస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బర్రెలక్కకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చిందని, కారు కూడా గిఫ్ట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బర్రెలక్క ఈ వార్తలపై స్పందించింది. ” బిగ్ బాస్ నుంచి నన్ను ఎవరు సంప్రదించలేదు. అసలు వారికి నేను ఎవరో కూడా తెలిసి ఉండదు. తెలిసి ఉంటే పిలిచేవారేమో. ఇక కారు గిఫ్ట్ ఇచ్చారు అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అయితే నామినేషన్ వేశాక .. ప్రచారం కోసం అన్నవాళ్లు కారు కొన్నిరోజులు వాడుకోమని ఇచ్చారు. ఒక కారు మాత్రం ఒక అన్న ఫ్రీగా ఇచ్చాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బర్రెలక్క వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఎలక్షన్స్ లో బర్రెలక్క ఎన్ని ఓట్లు సొంతం చేసుకుంటుందో చూడాలి.