Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఎట్టకేలకు బాంబ్ పేల్చేశాడు. ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న విషయాన్నీ కుండబద్దలు కొట్టేశాడు. ఇప్పటివరకు రాజకీయాలు టైమ్ వేస్ట్ యవ్వారాలు అని చెప్పిన బండ్లన్న.. ఇప్పుడు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికం చేసేశాడు. నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. నిర్మాతగా మారి.. పవన్ కళ్యాణ్ తో మంచి సినిమాలు తీసి, ఆయనకు భక్తుడిగా ఉంటూ వచ్చిన బండ్ల .. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తరువాత కొన్నిరోజులకు రాజకీయాలకు స్వస్తి చెప్పి.. సినిమాలు చేసుకుంటున్న బండ్ల .. ఇన్నాళ్లకు మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పుకొస్తూ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో అడిగినా.. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పిన బండ్ల.. ఇప్పుడు నీతి, నిజాయితీతో రాజకీయాలు చేస్తాను అని చెప్పుకొచ్చాడు.
Mouni Roy: అమ్మడు.. నీకు పెళ్లి అయ్యింది.. గుర్తుందా.. ఏంటీ అందాల ప్రదర్శన
“నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా.. బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై.. రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా” అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఇదెక్కడి కొత్త ట్విస్ట్ మావా.. కొత్తగా మాట్లాడుతున్నావ్.. రాజకీయాలు, నిజాయితీ అని చెప్తున్నావ్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక బండ్ల ఇప్పుడు ఏ పార్టీలో చేరతాడు అనేది తెలియాల్సి ఉంది.
రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా🔥🔥🔥🔥🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై 🔥🔥🔥🔥🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా 🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023