నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ని చేరువలో ఉంది. 5వ వారం లోకి ఎంటర్ అయిన భగవంత్ కేసరి సినిమా అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ కంప్లీట్ చేసుకోని ఇప్పటికి కొన్ని సెంటర్స్ లో మంచి బుకింగ్స్ నే రాబడుతోంది. కొత్త సినిమాల విడుదలతో థియేటర్స్ కౌంట్ తగ్గింది, దీంతో భగవంత్ కేసరి సినిమా థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. సిల్వర్ స్క్రీన్ పైన శ్రీలీలతో కలిసి సందడి చేసిన బాలయ్య ఇప్పుడు ఓటీటీలోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అయ్యాడు. రేపు అమెజాన్ ప్రైమ్ లో భగవంత్ కేసరి సినిమా ప్రీమియర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.
Read Also: Yash: ఈ హీరో కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో ఒకటే రచ్చ…
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి థియేటర్ లో ఆడియన్స్ ని ఎంతగా మెప్పించిందో… ఓటీటీలో కూడా భగవంత్ కేసరి అంతే మ్యాజిక్ చేయడం గ్యారెంటీ. బాలయ్య అభిమానులకి కావాల్సిన మాస ఎలిమెంట్స్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్లు కూడా ఓటీటీలో భగవంత్ కేసరి సినిమా చూడడం గ్యారెంటీ. అయితే బాలయ్య నటించిన అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యి మంచి వ్యూవర్ షిప్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరి మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది కాబట్టి ఆ రెండు సినిమాలని మించే వ్యూవర్షిప్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.
Read Also: Rajinikanth: సూపర్ స్టార్ బర్త్ డేకి సరైన కమర్షియల్ సినిమా రీరిలీజ్…