యష్… ఈ జనరేషన్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన కన్నడ హీరో. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా హీరో. KGF 1 అండ్ 2 సినిమాలతో యష్ ఇండియా వైడ్ మార్కెట్ అండ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని యష్ ఓన్ చేసుకున్న విధానం, స్క్రీన్ పైన తను చూపించిన గ్యాంగ్ స్టర్ యాటిట్యూడ్ కి యూత్ అంతా ఫిదా అయ్యారు. అంత క్రేజ్ తెచ్చుకున్న యష్ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఏడాదిన్నర దాటినా కూడా యష్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ చెప్పకుండ చాలా సైలెంట్ గా ఉన్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే యష్ ఎక్కడ కనిపించినా, సోషల్ మీడియాలో #Yash19కి సంబంధించిన రచ్చ జరుగుతుంది. లేటెస్ట్ గా యాష్ BGS ఉత్సవ్ కి గెస్ట్ గా వచ్చాడు.
ప్రతి ఏటా గ్రాండ్ గా జరిగే బాల గంగాధరనాథ మహాస్వామిజీ కాలేజ్ వేడుకలు, ఈ ఇయర్ కూడా ఘనంగా స్టార్ట్ అయ్యాయి. ఈ ఉత్సవ్ కోసం వచ్చిన యష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు యష్ 19 ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. అయితే KGF సినిమాలో రాఖీ భాయ్ గా కనిపించిన యష్, తన నెక్స్ట్ సినిమాలో ‘ఛత్రపతి శివాజీ’గా నటిస్తున్నాడని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ మూవీ ‘ఛత్రపతి శివాజీ’ వీరోచిత చరిత్ర ఆధారంగానే తెరకెక్కుతోందని టాక్. ఈ కారణంగానే అనౌన్స్మెంట్ కి టైమ్ తీసుకోని, పక్కాగా స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీప్రొడక్షన్ చేసిన తర్వాతే అనౌన్స్మెంట్ ఇవ్వాలని యష్ భావిస్తున్నాడట. అందుకే యష్ 19 అనౌన్స్మెంట్ డిలే అవుతుందని, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. మరి ‘ఛత్రపతి శివాజీ’గా యష్ ఎలా కనిపిస్తాడు? ఎప్పుడు సినిమాని అనౌన్స్ చేస్తాడు? అనేది చూడాలి.