సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ గా జైలర్ సినిమా నిలిచింది, ఈ సినిమాతో 650 కోట్లు రాబట్టిన రజినీకాంత్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసాడు. ప్రస్తుతం రజినీకాంత్ అమితాబ్ బచ్చన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రజినీకాంత్ బర్త్ డే రోజైన డిసెంబర్ 12న ఒక సూపర్ అప్డేట్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డిసెంబర్ 12న రిలీజయ్యే అవకాశం ఉంది.
తలైవర్ 170 సినిమా నుంచి వచ్చే అప్డేట్ తో పాటు… రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న తలైవర్ 171 ప్రాజెక్ట్ నుంచి కూడా అఫీషియల్ అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అప్డేట్ బయటకి వస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం గ్యారెంటీ. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి లోకేష్ నుంచి జస్ట్ తలైవర్ 170 టైటిల్ బయటకి వచ్చినా చాలు హైప్ ఆకాశాన్ని తాకుతుంది. ఈ రెండు చాలవన్నట్లు రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా శివాజీ తెలుగులో రీరిలీజ్ అవుతోంది. శంకర్-రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సినిమా… సరైన కమర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకుంది. శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్, రజినీ మార్క్ హీరోయిజం… రెండూ పర్ఫెక్ట్ గా సెట్ అయిన శివాజీ సినిమా డిసెంబర్ 12న తెలుగులో రీరిలీజ్ అవనుంది.