Balakrishna : తెలుగు నాట రియాల్టీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు అయిపోయాయి. త్వరలోనే బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ప్లేస్ లో మరో కొత్త స్టార్ ను తీసుకురావాలని చూస్తున్నారంట. ఎందుకంటే ప్రతిసారి నాగార్జుననే ఉంటే ప్రేక్షకుల నుంచి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదని మేనేజ్ మెంట్ భావిస్తోంది. నాగార్జున ది బెస్ట్ ఇస్తున్నా.. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి బాలకృష్ణను తీసుకువచ్చేందుకు ట్రై చేస్తున్నారంట.
Read Also : Vijay-Rashmika : మళ్లీ దొరికేసిన విజయ్, రష్మిక.. ఇంకెన్నాళ్లు దాస్తారు..?
అన్ స్టాపబుల్ షోతో బాలయ్య ఫుల్ క్రేజ్ సంపాదించాడు. హోస్ట్ గా పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. కాబట్టి బాలయ్యను తీసుకొస్తే టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు భావిస్తున్నారంట. పైగా బాలయ్య లాంటి మాస్ హీరో ఉంటే ఆయన ఫ్యాన్స్ బిగ్ బాస్ చూస్తారు. కాబట్టి ఇప్పటికే బాలయ్యతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లో తొమ్మిదో సీజన్ స్టార్ట్ కాబోతోంది. కాబట్టి ఈ లోగా బాలయ్యను ఒప్పించి ఈ షోకు హోస్ట్ గా చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టాక్. బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పైగా అన్ స్టాపబుల్ కూడా ఉంది. అటు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఆయన బిగ్ బాస్ కు టైమ్ కేటాయిస్తారా లేదా అన్నది చూడాలి.