Balakrishna : భారీ అంచనాల నడుమ వస్తున్న జైలర్2పై రోజుకొక న్యూస్ వినిపిస్తోంది. మొదటి పార్టు జైలర్ భారీ హిట్ కావడంతో ఇప్పుడు రెండో పార్టుపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా చెన్నైలో స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో ఆయా ఇండస్ట్రీల ప్రముఖ హీరోలు కూడా నటిస్తున్నారు. మొదటి పార్టులో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే. వీళ్లు రెండో పార్టులో కూడా నటిస్తున్నారు. వీరితో పాటు నందమూరి బాలకృష్ణ కూడా కీలక పాత్రలో మెరుస్తున్నారు.
Read Also : NBK : మ్యాన్షన్ హౌస్ అంబాసిడర్‌గా… బాలకృష్ణ డైరెక్ట్ ప్రమోషన్
సోర్స్ ప్రకారం ఆయన ఏపీలోని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘లక్ష్మీ నరసింహా’ సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ గా కనిపించారో.. ఇప్పుడు జైలర్-2లో కూడా అలాంటి పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తారంట. ఫ్లాష్ బ్యాక్ లో రజినీకాంత్ కు బాలకృష్ణకు మధ్య పవర్ ఫుల్ సీన్లు కొన్ని పెట్టారని తెలుస్తోంది. తెలుగు ఆడియెన్స్ కు కావాల్సిన మాస్ స్టఫ్ ఇందులో ఉంచుతున్నారంట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్లు కూడా వస్తాయని అంటున్నారు. ఇందులో రమ్యకృష్ణ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో మెరుస్తున్నారు.
Read Also : Junior: హీరోగా ఎంట్రీ ఇస్తున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు…