నందమూరి బాలకృష్ణ ఓ పాపులర్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. అది కూడా ఆయనకు నచ్చిన బ్రాండ్ కావడం విశేషం. ఇంతకు ముందు ఆయన కొన్ని యాడ్స్ చేసినా… ఇది మాత్రం సమ్‌థింగ్ స్పెషల్ అని చెప్పాలి. బాలయ్య చేసిన కొత్త యాడ్ తాజాగా విడుదల చేశారు. బాలయ్య కు ఇష్టమైన డ్రింకింగ్ బ్రాండ్ ఏది? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమెరికా వెళ్లినా సరే తన వెంట మ్యాన్షన్ హౌస్ తీసుకుని వెళతారు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చిన్న అల్లుడు చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడూ దాని గురించి బాలయ్య తన నోటి వెంట చెప్పింది లేదు.
Also Read : Junior: హీరోగా ఎంట్రీ ఇస్తున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు…
కానీ ఈ సారి ఏకంగా ఈ బ్రాండ్ పై యాడ్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ యాడ్ లో బాలయ్య లుక్ అదిరిపోయింది. అయితే ఆహా తెలుగు ఓటీటీలో ఆయన హోస్ట్ గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకి మ్యాన్షన్ హౌస్ అడ్వర్టైజింగ్ పార్ట్నర్ అయింది. అప్పుడు మొదటిసారి బాలయ్య నోటి వెంట మ్యాన్షన్ హౌస్ అని వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ సంస్థకు ఆయన ప్రచారం చేస్తూ ఒక వాణిజ్య ప్రకటన చేయడం విషేశం ప్రజంట్ ఈ యాడ్ వైరల్ అవుతుంది.
#NBK Officially Signs On as Brand Ambassador for 'Mansion House.' pic.twitter.com/ZIpGeHQhma
— Whynot Cinemas (@whynotcinemass_) May 15, 2025