Balakrishna Fans : ఫ్యాన్స్ అత్యాత్సాహం మరీ ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా రీ రిలీజ్ సినిమాలకు వెళ్తున్న యువత.. సీన్స్ రీ క్రియేట్ చేసేందుకు దేనికైనా రెడీ అంటున్నారు. మొన్న ఖలేజా సినిమా థియేటర్లో సీన్ రీ క్రియేట్ కోసం ఓ అభిమాని ఏకంగా పామును థియేటర్ కు తీసుకొచ్చాడు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇదే బాట పట్టారు. బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ మూవీని రీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇడ్లీలో బీర్ కలుపుకుని తినే సీన్ ఉంటుంది.
Read Also : Tammudu : తమ్ముడు ట్రైలర్ వచ్చేది ఆ రోజే..
థియేటర్ కు వచ్చిన అభిమానులు కొందరు ఆ సీన్ ను రీ క్రియేట్ చేయడానికి ఏకంగా బీర్, ఇడ్లీతో వచ్చారు. థియేటర్ లోనే ఇడ్లీలో బీర్ కలుపుకుని తిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా థియేటర్ లోకి ఇలాంటివి ఎలా అనుమతిస్తున్నారని మండిపడుతున్నారు.
సీన్స్ రీ క్రియేట్ పేరుతో ఇలాంటి అభ్యంతరకర పనులు చేయడం ఏంటని తిట్టిపోస్తున్నారు. కొన్ని సార్లు సినిమా చూడటానికి వచ్చిన వారికి ఇలాంటివి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దంటూ కోరుతున్నారు సాధారణ ప్రేక్షకులు.
Read Also : SYG : సంబరాల ఏటిగట్టు నుంచి రవికృష్ణ సీరియస్ లుక్..