Tammudu : నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీ ట్రైలర్ డేట్ వచ్చేసింది. ముందు నుంచే అనౌన్స్ మెంట్స్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ డేట్ ను కూడా ఇలాంటి వీడియోతోనే అనౌన్స్ చేశారు. సప్తమి గౌడ, స్వాసిక మాట్లాడుతూ.. మేం అడగడం వల్లే మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు అంటారు. ఇంతలోనే లయ వచ్చి మీరెవరు.. వేరే మూవీలో నటించి తమ్ముడు సినిమా అనుకుంటున్నారా అని సెటైర్లు పేలుస్తుంది.
Read Also : SYG : సంబరాల ఏటిగట్టు నుంచి రవికృష్ణ సీరియస్ లుక్..
దీంతో లయ, వర్ష బొల్లమ్మ ఇద్దరూ వారి ముఖాలను చూసి నవ్వుకుంటారు. ఈ గ్యాప్ లో డైరెక్టర్ వేణు శ్రీరామ్ వచ్చి వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే ట్రైలర్ రావాల్సిందే. అది ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు వస్తుందని ప్రకటిస్తాడు. దీంతో వీడియో ఎండ్ అవుతుంది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మూవీని ముందుగా ప్రకటించినట్టే జులై 4న రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ చెబుతోంది. ఆ డేట్ కు కింగ్ డమ్ మూవీ వస్తున్నా సరే వెనక్కు తగ్గట్లేదు. ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా గనక జులై 4కే వస్తే అప్పుడు కింగ్ డమ్ వాయిదా పడుతుంది. అంతే గానీ తమ్ముడు మూవీ రావడం పక్కా అంటున్నారు మేకర్స్.
Read Also : Tammudu : చెప్పిన డేట్ కే వస్తున్న ’తమ్ముడు’.. నో డౌట్..