SYG : యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచుతోంది. రోహిత్ కేపీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను చైతన్యరెడ్డి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది సంబరాల ఏటిగట్టు. ఇందులో సాయిధరమ్ తేజ్ లుక్ బాగానే ఆకట్టుకుంటోంది. మూవీ కోసం పూర్తిగా ఫిటిక్ మార్చేసుకున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి రవికృష్ణ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా నుంచి ఆయన సీరియస్ లుక్ బయటకు వచ్చింది.
Read Also : Tammudu : చెప్పిన డేట్ కే వస్తున్న ’తమ్ముడు’.. నో డౌట్..
సీరియల్స్ తో క్రేజ్ సంపాదించుకున్న రవికృష్ణ.. ఇప్పుడు ఏటిగట్టులో మంచి పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లుక్ ను తాజాగా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవికృష్ణ ఇందులో అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. అతను కూడా ఇందులో సోల్జర్ డ్రెస్సుల్లో కనిపిస్తున్నాడు.
మరి పోస్టర్లతోనే ఈ స్థాయిలో హైప్ పెంచుతున్న ఈ సినిమా ఏ మాత్రం రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. సాయిధరమ్ తేజ్ ఈ మధ్య ఎంచుకుంటున్న సినిమా కథలు తీవ్ర ఆసక్తిని రేపేలాగానే ఉంటున్నాయి. ఏదో ఒక మిస్టరీ ఉండి, కంటెంట్ బలంగా ఉండే వాటినే ఎంచుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో గత హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది చూడాలి.
Read Also : S*exual Harassment: ఉద్యోగం కోసం వెళితే.. పోర్న్‌లో నటించాలని చిత్రహింసలు..!
Wising the talented Actor #RaviKrishna aka SUBBI from #SambaralaYetiGattu a very Happy Birthday
Mega Supreme Hero @IamSaiDharamTej #SYG #SYGMovie pic.twitter.com/YcVFYL08J6
— BA Raju's Team (@baraju_SuperHit) June 9, 2025