Balakrishna Bhagavanth kesari Surprises: నందమూరి బాలకృష్ణకు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆయన మాస్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ను ఎంజాయ్ చేసేందుకు సినిమాలు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరిగా వీరసింహరెడ్డి సినిమాతో మరో మాస్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇక ఏ వీరసింహారెడ్డి హిట్టుతో ఓ అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు బాలయ్య. అదేంటంటే ఒక హీరో వరుసగా డబుల్ యాక్షన్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం అన్నమాట. ఇప్పుడు ఆ రికార్డును తానే బద్దలు కొట్టేందుకున్ సిద్ధం అయినట్టుప్రచారం జరుగుతోంది.
Bigg Boss: బిగ్‌బాస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రతిపక్షాల విమర్శలు..
బాలయ్య చేసిన గత రెండు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డిలలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించారు. అంతేకాదు.. ఈ రెండు సినిమాలు బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలివగా వరుసగా రెండు డ్యూయల్ రోల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరోగా బాలయ్య రికార్డ్ క్రియేట్ చేశారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో “భగవంత్ కేసరి” అనే సినిమా చేయగా అది దసరా సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఈ మధ్యనే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రయిలర్ లో కనిపించని అసలు సిసలు సంగతులు చాలా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా బాలయ్య పవర్ ఫుల్ రెండో గెటప్ గురించి ఏమాత్రం హింట్ ఇవ్వలేదని, కావాలనే దాచారని అంటున్నారు.