Ayan Mukerji strongly wanted Jr NTR to be part of war 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నాడంటే మనకి కొత్తేమి కాదు ఎందుకంటే ఆయన గతంలోనే జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్ అందరిలో మంచి ఇంపాక్ట్ నింపేసింది. అయితే ఆ పాత్ర జస్ట్ శాంపిల్ మాత్రమే అలాగే అది ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ కాబట్టి.. అసలైన విలన్ పూర్తిగా బయటికి రాలేదనే చెప్పాలి. అయినా స్కోప్ లేకపోయినా తాను కల్పించుకుని రావణాసురుడిగా నట విశ్వరూపం చూపించాడు యంగ్ టైగర్. కానీ వేరే హీరో సినిమాలో ఎన్టీఆర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో.. చెప్పడానికి బాక్సాఫీస్ లెక్కలు సరిపోవని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాది అదే జరగబోతోంది. 2024 లో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ‘వార్ 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడని అంటున్నార. అయితే బాలీవుడ్, టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా యశ్ రాజ్ ఫిలింస్ వారు ఏరికోరి మరీ తారక్‌నే ఎందుకు సంప్రదించారు? దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ ఎందుకు రాశాడు? అనేది చర్చనీయాంశంగా మారింది.
Breaking: సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ మృతి
అయితే ఎన్టీఆర్‌నే ఈ క్యారెక్టర్‌కు ఎందుకు ఎంచుకున్నారనే దానికి అసలైన రీజన్ గట్టిదే అంటున్నారు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ విలనిజం చూసి ఫిదా అయిన అయాన్ ముఖర్జీపట్టుబట్టి మరీ ఎన్టీఆర్‌ను వార్2 కోసం ఒప్పించినట్టు తెలుస్తోంది. తారక్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు సై అనడంతో.. వార్2 ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రాబోతోందని అంటున్నారు. అసలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే గూస్‌బంప్స్ వస్తున్నా ఈ ఇద్దరు హీరోలను బిగ్ స్క్రీన్ పై చూస్తే అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చని అంటున్నారు అభిమానులు. నవంబర్ లోపే దేవర షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత వార్ 2లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలతో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం గ్యారెంటీ అని ఆనంద పడుతున్నారు అభిమానులు.