Avatar 2: అవసరాల శ్రీనివాస్ పేరు వినగానే పెక్యులర్ నటుడు మన కళ్ళముందు మెదలుతాడు. అంతే కాదు తనలోని రైటర్ కమ్ డైరెక్టర్ మనముందు సాక్షాత్కరిస్తాడు. తను డైరెక్ట్ చేసిన ‘జ్యో అచ్యుతానంద, ఊహలు గుసగుసలాడే’ సినిమాలే అందుకు నిదర్శనం. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ రాసింది కూడా అవసరాల శ్రీనివాస్ కావడం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 2’ తెలుగు వెర్షన్‌కి డైలాగ్స్ రాసింది కూడా అవసరాల శ్రీనివాస్ కావటం విశేషం. 13 సంవత్సరాల క్రిత వచ్చిన సూపర్ హిట్ ‘అవతార్’ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ‘అవతార్ 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అవసరాల డైలాగ్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also: AHA: ఓటీటీలో ‘వాళ్ళిద్దరి మధ్య’! వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు!!