కత్రినా, విక్కీ దాంపత్యంపై జోస్యం… ప్రముఖ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్‌ల పెళ్ళి సందడి నడుస్తోంది. ఈ విషయమై స్టార్ లవ్ బర్డ్స్ ఇద్దరూ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ బాలీవుడ్ మీడియా మాత్రం కోడై కూస్తోంది. ఈ జంట డిసెంబర్‌లో తమ పెళ్లి కోసం సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాను బుక్ చేసుకున్నారు. వీరిద్దరూ రెండేళ్లకు పైగా కలిసి ఉంటున్నారు. వారు పెళ్లి విషయంపై స్పందించకపోయినా, వెడ్డింగ్ ప్లానర్లు అన్ని ఏర్పాట్లు చేయడానికి లొకేషన్‌కు వెళ్లడం గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉంది. ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు, హోటల్ బుకింగ్స్, దాదాపు 150 మంది అతిథుల కోసం అత్యంత ఖరీదైన వాహనాల బుకింగ్ మొదలైన పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇప్పుడు వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అనే విషయంపై ప్రముఖ జ్యోతిష్య పండితుడు జగన్నాథ్ గురూజీ జోస్యం చెప్పారు.
Read also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
Also Read
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రైవసీని కోరుకునే వ్యక్తిత్వం గలవారని, వారి సంబంధాన్ని మీడియా నుండి దూరంగా ఉంచాలనుకుంటున్నారని అతను చెప్పాడు. వారు పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నట్లు, పెళ్లి తరువాత కూడా కత్రినా కైఫ్ సినిమాలు చేస్తుందని, రాబోయే సంవత్సరాల్లో ఆమె మరిన్ని మంచి సినిమాల్లో నటిస్తుందని అన్నారు. మరోవైపు విక్కీ కౌశల్ స్టార్ గా, నటుడిగా మరింత ఎదుగుతాడు అంటూ జోస్యం చెప్పాడు. మంచి వార్త ఏమిటంటే ఈ జంటకు సంబంధించి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆయన అంచనా వేసాడు. ఇద్దరూ చాలా తెలివైన వారని, ఒకరి పట్ల మరొకరికి అపారమైన గౌరవం ఉంటుందని, వారు ఒకరి అభిరుచులను మరొకరు దృష్టిలో ఉంచుకుంటారని చెప్పుకొచ్చాడు ఆ జ్యోతిష్యుడు.
తాజావార్తలు
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!