Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irummudi Box Office Collections: ‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం.. కలెక్షన్ల పరంగా జోరు చూపిస్తోంది. నాలుగో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ.. థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగానే ఉండటం విశేషం.
ఇప్పటికే థియేట్రికల్ రన్లో 25 రోజులు పూర్తి చేసుకున్న ఇరుముడి.. ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్స్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతోంది. దీంతో మేకర్స్‌కు ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టగా.. రూ.250 కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ మార్క్‌ను అందుకోవడానికి సినిమా మరింత దూకుడు చూపించాల్సి ఉంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
మరోవైపు ఇరుముడి సినిమాకు సంబంధించి డిజిటల్ ప్రీమియర్ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 18 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన తుది దశకు చేరుకున్నట్టే. సాధారణంగా ఓటీటీలోకి సినిమా అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేట్రికల్ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో.. ఇరుముడి రూ.250 కోట్ల మార్క్‌ను అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్న సినిమాల్లో ఇరుముడి ముందంజలో ఉంది. వచ్చే వారం నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకు ఇరుముడికి థియేటర్లలో మంచి రన్ కొనసాగే అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్ 18 నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో.. పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.240 కోట్లకు చేరువైన ఇరుముడి.. ఓటీటీ రిలీజ్‌కు ముందే లేదా ఆ తర్వాత రూ.250 కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!