Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu-Sanjay Leela Bhansali Movie on Cards: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు తదుపరి సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌కు చెందిన స్టార్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది.
భారీ చిత్రాలు, అద్భుతమైన సెట్లు, రిచ్ విజువల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. గత కొంతకాలంగా తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పలువురు టాప్ హీరోలతో భన్సాలీ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా భన్సాలీ చూపు మహేష్ బాబుపై పడినట్లు టాక్. అంతేకాదు ఇటీవల భన్సాలీ స్వయంగా మహేష్ బాబును కలిసి ఓ కథను వినిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భన్సాలీ మార్క్‌లో ఉండే భారీ సెట్లు, గ్రాండ్ విజువల్స్, ఇంటెన్స్ డ్రామాతో కూడిన కథను మహేష్‌కు వివరించినట్లు సమాచారం.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు పూర్తిగా వారణాసి సినిమాపైనే దృష్టి పెట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయి, విడుదలైన తర్వాతే తన తదుపరి సినిమాపై సూపర్ స్టార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మహేష్ తదుపరి లైనప్‌లో ఇప్పటికే పలువురు క్రేజీ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు కూడా తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!