Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Today: బంగారం, వెండి ప్రియులకు శుభవార్త చెబుతూ.. మరోసారి భారీగా పతనం అయ్యాయ.. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ముఖ్యంగా వెండి ధరలో భారీ పతనం నమోదైంది. కిలో వెండి ధర రూ.4,500కు పైగా తగ్గడంతో ఇన్వెస్టర్ల దృష్టి ఈ పతనంపై పడింది.
కిలో వెండి ధర రూ.4,565 తగ్గింది
MCXలో డిసెంబర్ 4 డెలివరీకి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ ధర గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో కిలోకు రూ.2,30,221కు పడిపోయింది. అంతకుముందు ట్రేడింగ్ రోజైన బుధవారం వెండి ధర రూ.2,34,786 వద్ద ముగిసింది. దీంతో ఒక్కసారిగా కిలో వెండి ధర రూ.4,565 మేర తగ్గింది. ఈ తాజా పతనంతో వెండి ధర తన జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి మరింత దిగివచ్చింది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో వెండి ధర తొలిసారిగా కిలోకు రూ.4 లక్షల స్థాయిని దాటి చారిత్రక గరిష్ఠమైన రూ.4,20,048కు చేరుకుంది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఆ గరిష్ఠ స్థాయి నుంచి కిలో వెండి దాదాపు రూ.1,89,827 మేర తగ్గింది.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
బంగారం ధర కూడా భారీగా తగ్గింది
వెండి మాత్రమే కాకుండా బంగారం ధర కూడా గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా తగ్గింది. MCXలో అక్టోబర్ 5 డెలివరీకి సంబంధించిన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు బుధవారం రూ.1,52,470 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్ ప్రారంభంతో అది రూ.1,50,483కు పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1,987 మేర తగ్గింది. ఒక్కరోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే దాదాపు రూ.2,000 తగ్గడం గమనార్హం. ఇక, సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఆగస్టు 31న మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,460 వద్ద ఉంది. గురువారం నమోదైన రూ.1,50,483 ధరతో పోలిస్తే ఆ స్థాయి నుంచి ఇప్పటివరకు బంగారం ధర రూ.3,977 మేర తగ్గింది. అయితే ఇవి MCXలో నమోదైన ఫ్యూచర్స్ ధరలు. దేశీయ రిటైల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నగరం, ఆభరణాల స్వచ్ఛత, మేకింగ్ ఛార్జీలు, పన్నులు తదితర అంశాల ఆధారంగా మారవచ్చు.
ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 మేర తగ్గి.. రూ.1,52,840కి దిగి వచ్చింది.. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.550 తగ్గి రూ.1,40,100కి పడిపోయింది.. మరోవైపు కిలో వెండి ధర రూ.2,50,000గా ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!