విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ విడుదలైంది. టీజర్ తో పాటు సినిమాను మార్చి 4న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇక టీజర్ విషయానికి వస్తే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో విశ్వక్ సేన్ పోషించిన పాత్ర అర్జున్ కుమార్ వధువు కోసం అన్వేషణ సాగించటం.. చివరికి పసుపులేటి మాధవి రుక్షర్ ధిల్లాన్ తో ముడిపడటంగా సాగుతుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అందంగా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
Read Also : ‘రాధే శ్యామ్’కి బాట్‌మ్యాన్ దెబ్బ!?
చివరలో ‘తాగితే గాని మాబతులకు ఏడుపురాదు… తాగినోడి ఏడుపుకేమో వాల్యూలేదు’ అనే డైలాగ్ తో అర్జున కుమార్ పెళ్ళి వెనుక ఏదో ఉందని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ చిత్రానికి బివిఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పకుడు. ‘రాజా వారు రాణి వారు’ ఫేమ రవికిరణ్ కోలా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించారు.