సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి ఓవరాల్ గా థియేటర్స్ లో 900 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా, ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం ఇదే మొదటిసారి. అనిమల్ సినిమా హిట్ అవుతుంది అని అందరూ నమ్మారు కానీ మరీ ఈ స్థాయి హిట్ అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చిన అనిమల్ సినిమాకి సీక్వెల్ గా “అనిమల్ పార్క్” అనౌన్స్ అయ్యింది. ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో మూవీ చేసిన తర్వాత అనిమల్ పార్క్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ ఊహించని దాని కన్నా ముందే అనిమల్ పార్క్ సెట్స్ పైకితీసుకోని వెళ్లేలా సందీప్ ప్లాన్ చేస్తున్నాడట.
అయాన్ ముఖర్జీ వార్ 2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు కాబట్టి రణబీర్ తో బ్రహ్మాస్త్ర 2కి టైమ్ పడుతుంది. ప్రభాస్ కల్కి, ది రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ నుంచి ప్రభాస్ ఫ్రీ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఈ గ్యాప్ లో సలార్ 2 కూడా త్వరగానే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సలార్ 2 స్టార్ట్ అయితే స్పిరిట్ మరింత డిలే అవ్వడం గ్యారెంటీ. సో ఈ గ్యాప్ ని వాడుకుంటూ అనిమల్ పార్క్ సినిమాని కంప్లీట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నాడు. అనిమల్ పార్క్ సినిమాతో ఐ విల్ హ్యావ్ ఏ బ్లాస్ట్ అంటూ సందీప్ రెడ్డి వంగ ఇటీవలే ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వింటే అణిమపి పార్క్ ఎంత వైల్డ్ గా ఉండబోతుందో ఊహించొచ్చు. అనిమల్ పార్క్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి రిలీజైనా కూడా ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకూ చూడనంత మోస్ట్ ఎరప్షన్ ని చూడబోతుంది. “ఇస్తాంబుల్ లో ఉండే అనిమల్ కి, ఢిల్లీ రన్ విజయ్ సింగ్ కి మధ్య వార్” వయొలెన్స్ అనే పదానికే కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.