అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అనతి కాలంలోనే తన అందం, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘పరదా’ ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమతో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ, ట్రైలర్ రిలీజ్ నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల యంగ్ హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కాగా, అనుపమ కొత్త అవతారం, కథ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మించారు. అయితే
Also Read : Sridevi : ‘కోర్టు’ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి..! వీడియో వైరల్
నార్మాల్ గా సినిమా షూటింగ్‌లో నటీనటులు ఎన్నో రకాల అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు వాతావరణం కారణంగా, మరికొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వల్ల షూటింగ్‌లో అనుకోని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అలాంటి ఒక సంఘటన ‘పరదా’ సినిమా సెట్స్‌లో జరిగింది. అనుపమ పరమేశ్వరన్ ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో పంచుకున్నారు. ఆమె చెప్పిన ప్రకారం – బ్రిడ్జ్‌పై ఒక కీలక సన్నివేశం కోసం షూటింగ్ జరుగుతోందట. ఆ సీన్‌లో స్క్రిప్ట్ ప్రకారం అనుపమ కిందపడాలి. డైరెక్టర్ షాట్ రెడీ అని చెప్పగానే, కెమెరాలు రికార్డు అవుతుండగా, అనుపమకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందట.. నొప్పి తట్టుకోలేక అనుపమ స్క్రిప్ట్‌లో ఉన్నట్టుగానే కిందపడిపోయారు. ఆ క్షణంలో చిత్రబృందం ఎవరికీ ఇది నిజంగా జరిగిందని తెలియలేదు. అందరూ ఆమె అద్భుతమైన నటన అని భావించి, సూపర్ షాట్ అంటూ ప్రశంసలు కురిపించారు. కానీ కొద్ది క్షణాలకే ఆమె పరిస్థితి సరిగాలేదని గుర్తించి వెంటనే దగ్గరకు పరుగెత్తి వచ్చారు. తర్వాత అసలు విషయం తెలిసి, ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న అనుపమ .. ‘ఆ రోజు నిజంగా మరచిపోలేని అనుభవం. సీన్‌లో నటించాల్సి ఉండగా, నిజంగానే కిందపడ్డాను. ఆ క్షణంలో యాక్టింగ్, రియాలిటీ కలిసిపోయాయి. మొదట అందరూ నటన అనుకున్నారు కానీ అది నిజం అని తెలిసి అందరికీ షాక్ అయ్యారు’ అని నవ్వుతూ చెప్పారు.