అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అనతి కాలంలోనే తన అందం, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘పరదా’ ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమతో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన…