Sridevi : ‘కోర్టు’ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి..! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేరుగా సినీ అవకాశాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో తాజాగా చేరిన పేరు ‘కోర్ట్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి. ఈ ఏడాది సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కోర్ట్ చిత్రంలో అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమా ఆఫర్లతో పాటు షాపింగ్ మాల్, రెస్టారెంట్ ఓపెనింగ్స్ వంటి ఈవెంట్లతో కూడా రెండు చేతులా సంపాదిస్తోంది. ఇంత వరకు భాగానే ఉన్నప్పటికి తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ ఓ రూమర్ హల్‌చల్ చేస్తోంది.
ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా శ్రీదేవి తన కుటుంబ సభ్యులకు రాఖీలు కడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె మెడలో పసుపు తాడు (తాళిబొట్టు) కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సాధారణంగా పెళ్లైన మహిళలే పసుపు తాడు ధరిస్తారని తెలుసు. దీంతో, ‘శ్రీదేవికి పెళ్లి ఎప్పుడు జరిగింది?’ ‘ఎవరికీ తెలియకుండా చేసుకుందా?’ ‘వరుడు ఎవరు?’.. అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది ఇది సినిమా షూటింగ్‌లో భాగమని ఊహిస్తుండగా, మరికొందరు వీడియోలో ఆమె ఇంట్లో ఉన్నట్లు కనిపిస్తోందని, షూటింగ్ కాకపోతే పసుపు తాడు ఎందుకు ధరిస్తుంది? అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ మిస్టరీపై శ్రీదేవి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఆమె నిజంగానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఉంటే, దానిని ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతుంది. ఏదేమైనా, ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
 
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!