Varalakshmi Sharathkumar: ఇండస్ట్రీ లో తరాలు మారుతున్నాయి.. తారలు మారుతున్నారు.. పరిస్థితులు మారుతున్నాయి.. అభిమానులు కూడా కాలానికి తగ్గట్టు మారుతున్నారు.. కానీ, అభిమానులు చూపించే ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. సినిమా నచ్చితే చూడడం.. తమ అభిమానుల నటీనటులను ప్రశంసించడం.. నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే తరాలు మారుతున్నప్పుడు ఒకరి నటనను మరిపించే తారలు మరొకరు వస్తుంటారు. ఒకప్పుడు సావిత్రిని ఇప్పుడు కీర్తి సురేష్.. సౌందర్యలా నిత్యా మీనన్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు మరిపిస్తున్నారని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక అదే రీతిగా సీనియర్ నటి రమ్య కృష్ణను, వరలక్ష్మీ శరత్ కుమార్ మరిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రంస్యాకృష్ణ.. అలంటి ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కెరీర్ మొదట్లో రమ్య చేసిన పాత్రలు వేరే ఎవరు చేయలేదు అంటే అతిశయోక్తి కాదు.
హీరోయిన్ గా గ్లామర్ ఒలకబోసినా ఆమె, స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన ఆమె. ఇక అవే కాకుండా ఛాలెంజిగ్ విలన్ పాత్రలను చేయడంలో ఆమెను మించినవారు లేరు. ముఖ్యంగా నరసింహా సినిమాలో రమ్యకృష్ణ విలనిజాన్ని ఇప్పటివరకు ఎవరు కొట్టినవారు లేరు. ఎంతమంది లేడీ విలన్స్ కనిపించినా ఆమె తరువాతనే ఎవరైనా అనే పేరు ఉంది. ఇక ఈ తరంలో వరలక్ష్మీ ఆమెను మరిపిస్తుందని అభిమానులు చెప్పుకొంటున్నారు. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల్లో వరు నటనే అందుకు నిదర్శనం. వీరసింహారెడ్డిలో భానుమతిగా వరు నటన, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నటనతో పోలుస్తున్నారు. రివెంజ్ కోసం ఎంతకైనా తెగించే ఆడవారిగా వీరిని పోలుస్తున్నారు. ముందు ముందు వరు, రమ్యకృష్ణలా మారిపోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోపక్క వరు కూడా తాను విలన్ గానే పనికొస్తానని ముందే అనుకున్నట్లు చెప్పుకురావడంతో మంచి భవిష్యత్తు ఉంది ఆమెకు అని అభిమానులు అంటున్నారు.