రౌడీ హీరో విజయ్ దేవరకొండకు.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాల తర్వాత.. మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు. చివరగా వచ్చిన డియర్ కామ్రేడ్.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు విజయ్. దాంతో ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. దాంతో లైగర్ తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు విజయ్. ఇప్పటికే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను అనౌన్స్ చేశాడు. మరోవైపు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఖుషి మూవీలో నటిస్తున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలె ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.
ఇక ఈ సినిమాలన్నీ లైన్‌లో ఉండగానే.. తాజాగా డైరెక్టర్ మోహన క్రిష్ణ ఇంద్రగంటికి కూడా.. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత విజయ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్‌లోనే ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కూడా ఓ సినిమా ఉంటుందని.. చాలా రోజులుగా వినిపిస్తోంది. సుకుమార్, విజయ్ కూడా పలు సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతు వస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నాడు సుక్కు. ఆ తర్వాత విజయ్‌తో సినిమా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ ఇప్పుడు రౌడీ హీరో లైనప్ చూస్తుంటే.. సుకుమార్ సినిమా ఉంటుందా.. లేదా.. అనే సందేహాలు వస్తున్నాయి. ఏదేమైనా.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడని చెప్పొచ్చు.