రౌడీ హీరో విజయ్ దేవరకొండకు.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాల తర్వాత.. మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు. చివరగా వచ్చిన డియర్ కామ్రేడ్.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు విజయ్. దాంతో ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. దాంతో లైగర్ తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు…
‘గ్రహణం, అష్టాచెమ్మ, గోల్కొండ హైస్కూల్, అంతకుముందు ఆ తర్వాత, జెంటిల్ మేన్, సమ్మోహనం, వి’ వంటి విభిన్న తరహా సినిమాలు తీసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు తెలుసు’ సినిమాతో బిజీగా ఉన్నాడు మోహనకృష్ణ. అంతే కాదు నిర్మాతగానూ సినిమా నిర్మాణంలో అడుగుపెట్టబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఓ సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహించటం లేదు. సంతోష్ కాటాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌తో…