‘ఛలో’ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అమ్మడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
Also Read : NBK : బెజవాడలో బాలయ్య.. నందమూరి అభిమానుల భారీ ర్యాలీ
ఇక రణబీర్ తో చేసిన యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో భారీ హిట్ అందుకుంది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప2 మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఇలా రష్మిక చేసిన పాన్ ఇండియా చిత్రాలు భారీ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే హిట్‌ను తన ఖాతలో వేసుకుంది ఈ కన్నడ కుట్టీ. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ సేల్ బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు చావా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో రష్మిక మందన్నహ్యాట్రిక్ కొట్టేసింది.