కింగ్ ఖాన్ షారుఖ్ సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా ‘జవాన్’. నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా షారుఖ్ కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అట్లీ కమర్షియల్ సినిమాకి సోషల్ కాజ్ కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. షారుఖ్ సినిమా నార్త్ లో హిట్ అవ్వడం, డబ్బులు కలెక్ట్ చేయడం మాములే కానీ సౌత్ లో ఎప్పుడూ చెప్పుకునే స్థాయిలో కలెక్ట్ చేయలేదు. అట్లీ, నయనతార, అనిరుద్… జవాన్ సినిమాకి పని చేయడంతో ఈ మూవీకి సౌత్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ ముందే ఉన్న హైప్, కలెక్షన్స్ లో కనిపించింది. ఓవరాల్ గా జవాన్ సినిమా సౌత్ ఇండియాలో 150 కోట్లు రాబట్టింది. ఇది హిందీ సినిమాల్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్. ఒక బాలీవుడ్ సినిమా సౌత్ లో 150 కోట్లు రాబట్టడం అదే మొదటిసారి. అయితే జవాన్ సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికి వస్తుంది అనిమల్ మూవీ.
సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ తో కలిసి చేసిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీపై సాలిడ్ బజ్ జనరేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ క్లిక్ అవ్వడంతో అనిమల్ మూవీ బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా అనిమల్ సినిమాకి భారీ హైప్ ఉంది. సందీప్ కి ఉన్న ఇమేజ్ అనిమల్ సినిమాకి మరింత హెల్ప్ అవుతుంది. తెలుగులో అనిమల్ బుకింగ్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ హౌజ్ ఫుల్స్ అవ్వడంతో అనిమల్ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అనిమల్ మూవీ సాలిడ్ కలెక్షన్స్ ని రాబడితే జవాన్ సౌత్ కలెక్షన్స్ బ్రేక్ అవ్వడం కష్టమేమి కాదు. ఇదే జరిగితే రణబీర్ కపూర్ బాలీవుడ్ తో పాటు ఇకపై సౌత్ లో కూడా తన సినిమాలు రిలీజ్ చేస్తాడు.