గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తమన్నా హీరోయిన్ గా నటించిన “సీటిమార్” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్రబృందం. ముఖ్యంగా హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ సంపత్ నెక్స్ట్ మూవీలో అనసూయ ప్రధాన పాత్రలో నటించనుంది అని టాక్ నడుస్తోంది.
Read also : శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో సామ్ నెక్స్ట్ మూవీ ?
సంపత్ నంది ప్రస్తుతం బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలో “బ్లాక్ రోజ్” అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇది ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఆయన తన సహచరుడితో మరో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తుందని అంటున్నారు. త్వరలో సంపత్ నంది, అనసూయ భరద్వాజ్ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నారట.
మరోవైపు అనసూయ కూడా ఒకవైపు యాంకర్ గా, మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె రీసెంట్ గా “థాంక్యూ బ్రదర్”లో ప్రధాన పాత్రలో కనిపించింది. మాస్ మహారాజా రవితేజ “ఖిలాడీ” చిత్రంలో అనసూయ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న “పుష్ప: ది రైజ్” అనే పాన్ ఇండియా సినిమాలో కూడా భాగమయ్యింది. ఇప్పుడు సంపంత్ నంది నిర్మించబోయే ఫ్యామిలీ డ్రామాలో ప్రధాన పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది.