హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. వరుస అవకాశాలు అందుతున్న నేపథ్యంలోనే సమయాన్ని కేటాయించలేక జబర్దస్త్ షో నుంచి కూడా వైదొలిగినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం పుష్ప 2, గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్లో నటిసున్న అనసూయ మరో బంఫర్ ఆఫర్ పట్టేసిందని టాక్ నడుస్తోంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనసూయ నటించనున్నదని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం క్రిష్, పేయన్ తో హరిహరవీరమల్లు తెరెకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పూర్తి కావొస్తోంది. ఇక ఈ సినిమా తరువాత క్రిష్ చూపంతా ‘కన్యాశుల్కం’మీదనే ఉంది. ఈ కథను వెబ్ సిరీస్ రూపంలో పట్టాలెక్కించి పనిలో ఉన్నాడు క్రిష్. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సిరీస్ లో మధురవాణీ అనే ఒక వేశ్య పాత్రకోసం అనసూయను సంప్రదించడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం కూడా జరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాత్ర ఏదైనా జీవించేసే అనసూయ.. ఈ పాత్రలో కూడా తన సత్తా చాటుతోందని అంటున్నారు. ఈ పాత్రలో రొమాన్స్ ఒక్కటే కాకుండా ఒక భావోద్వేగమైన ప్రేమ కూడా కనిపిస్తుందట.. ఒక వేళ ఇదే కనుక నిజమైతే అనుసుయ కెరీర్ లో ఈ పాత్ర నిలిచిపోతుందని ఆమె అభిమానులు అంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే అనుసుయ క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.