చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే అంతగా ఎవరికీ తెలియదు కానీ, షార్ట్ గా ‘సీఎస్సార్’ అనగానే చప్పున గుర్తు పట్టేస్తారు జనం. తనదైన వాచకాభినయంతో అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రల్లో ఎంతగానో ఆకట్టుకున్నారు. నటరత్న యన్టీఆర్ కు ముందు తెలుగునాట శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారు. ఆ పై ప్రతినాయకునిగా, గుణచిత్ర నటునిగా హాస్యం పలికిస్తూ సాగిపోయారాయన. సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 1907 జూలై 11న మచిలీపట్నంలోని చిలకలపూడిలో జన్మించారు. స్కూల్ చదువు…