Anasuya : హాట్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనసూయ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తాను దారుణంగా మోసపోయానని చెప్పింది అనసూయ. ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్స్ అని తెలిసిందే. ఏదైనా సరే ముందే డబ్బులు చెల్లించి వస్తువు కోసం వెయిట్ చేస్తే.. చివరకు అది రావట్లేదు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా అనసూయకు కూడా ఇలాంటిదే ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టిందంట.
Read Also : Rajinikanth : రజినీపై ఆర్జీవీ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..
ముందే పే మెంట్ చేసేశానని.. నెల రోజులు అవుతున్నా సరే డ్రెస్సులు మాత్రం రాలేదని తెలిపింది. చివరకు రీ ఫండ్ కూడా రాలేదని.. ఇలాంటి వాటి వల్ల ఎంతో మంది మోసపోతున్నారంటూ తెలిపింది. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. రీసెంట్ గానే కొత్త విల్లాలోకి అడుగు పెట్టిన అనసూయ.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. పుష్ప సినిమాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో వరుసగా పెద్ద మూవీల్లో ఆఫర్లు వస్తున్నాయి ఈ భామకు. ఇక అనసూయ ట్రెండీ వేర్స్ డ్రెస్సులు వేస్తూ నిత్యం హాట్ హాట్ ఫొటోషూట్లు కూడా చేస్తోంది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.
Read Also : Fatima Sana : ప్రైవేట్ పార్టులు టచ్ చేశాడు.. అమీర్ ఖాన్ కూతురు కామెంట్స్