ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నిలబడాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు గ్లామర్ షో చేయడం కూడా తెలిసి ఉండాలి. స్కిన్ షో అని కాదు కానీ పాత్రకి తగ్గట్లు గ్లామర్ గా కనిపించడం తెలియాలి. కొంతమంది హీరోయిన్స్ చీరలో కూడా చాలా గ్లామర్ గా కనిపిస్తారు. ఇలాంటి హీరోయిన్స్ కి కెరీర్ ఎక్కువ రోజులు ఉంటుంది, మంచి క్యారెక్టర్స్ పడతాయి, స్టార్ హీరోయిన్ గా నిలబడతారు. అందుకే హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయికి యాక్టింగ్ స్కిల్స్ తో పాటు గ్లామర్ షో కూడా చేయడం తెలిసి ఉండాలి అంటుంటారు. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త హద్దులు పెట్టుకోని ఉన్నా కూడా నెమ్మదిగా ఒక్కో సినిమాతో ఆ హద్దులు కాస్త చెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే లిస్టులోకి వచ్చేలా ఉంది అనంతిక అనిల్ కుమార్.
మ్యాడ్ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన మలయాళ బ్యూటీ అనంతిక. నార్నే నితిన్ కి పెయిర్ గా క్యూట్ లుక్స్ తో యూత్ ని ఆకట్టుకుంది అనంతిక అనిల్ కుమార్. మొదటి సినిమాకే యూత్ క్రష్ గా మారిన అనంతిక తెలుగులో ముందుగా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడం కన్నా ముందే మ్యాడ్ రిలీజై హిట్ అయిపొయింది. త్వరలో మ్యాడ్ 2 కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సినిమాతో అనంతిక తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర అవ్వడం గ్యారెంటీ. మ్యాడ్ లో గ్లామర్ గా కనిపించిన అనంతిక… కోలీవుడ్ లోకి లాల్ సలామ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రజినీకాంత్ నటించిన ఈ మూవీలో అనంతిక మంచి క్యారెక్టర్ ప్లే చేసిందట. ఈ మూవీ ప్రమోషన్స్ లో అనంతిక కాస్త గ్లామర్ గానే కనిపించింది. క్యూట్ గా కనిపిస్తూనే యూత్ ని ఇంప్రెస్ చేసేలా గ్లామర్ గా కనిపించడంలో మలయాళ హీరోయిన్స్ చాలా స్పెషల్. అనంతిక ఇప్పుడు ఇదే రూట్ లో వెళ్తుంది మరి కెరీర్ పరంగా అనంతికకి తెలుగులో ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది చూడాలి.