Allu Arjun to be chief guest for Mangalavaram Movie Pre Release Event: ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మించారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ఈ నెల 11న శనివారం హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
Anchor Suma: గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన సుమ తాత.. ఎందుకో తెలుసా?
ఆ ఫంక్షన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అల్లు ఆర్మీ, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని వెల్లడించారు. ‘మంగళవారం’ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలవగా సినిమాలో మూడు పాటలను కూడా విడుదల చేశారు. ఆ అన్నిటికీ మంచి స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ‘ఆర్ఎక్స్ 100’ తరహాలో మరోసారి డిఫరెంట్ కంటెంట్ అండ్ కమర్షియల్ బేస్డ్ సినిమాతో అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనే నమ్మకం ప్రేక్షకులలో కలిగించి, సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందించగా ‘కాంతార’ ఫేమ్ బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.