స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా నిలిపిన పుష్ప పార్ట్ వన్.. ఏకంగా నేషనల్ అవార్డ్‌ను కూడా ఇచ్చింది. దీంతో.. పుష్ప2 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాకి పూనకాలు తెప్పించే పనిలో ఉంది. మామూలుగా అయితే… బన్నీ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. బన్నీ మార్క్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటాయి. ఎలాంటి స్టెప్ అయినా సరే ఈజీగా వేసేస్తాడు బన్నీ. అలాంటిది… ప్రస్తుతం షూట్ చేస్తున్న గంగమ్మజాతర సెటప్‌లో, అమ్మవారి గెటప్‌లో చీర కట్టుకొని స్టెప్స్ వేయడానికి చాలా కష్ట పడుతున్నాడట ఐకాన్ స్టార్. అంతేకాదు.. ఒకానొక సమయంలో బన్నీకి బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందని చెబుతున్నారు.
బన్నీ రెస్ట్ తీసుకుంటున్న కారణంగానే పుష్ప 2 షూటింగ్ కి ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చాడట సుకుమార్, మళ్లీ 23 లేదా 24 నుండి షూటింగ్ ఉండొచ్చని అంటున్నారు. ఈ లెక్కన బన్నీ గంగమ్మ తల్లి జాతర సెటప్ లో ఉండే సాంగ్ షూటింగ్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు, పైగా దేవిశ్రీ కంపోజ్ చేసిన సాంగ్ దుమ్ములేపేలా ఉందట. అందుకే అల్లు అర్జున్ ది బెస్ట్ ఇవ్వాలని తెగ కష్టపడుతున్నాడట. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ కూడా అలాగే ఉండనుందట. అసలు… బన్నీ అమ్మవారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే అంతా షాక్ అయ్యారు. ఓ పాన్ ఇండియా హీరో ఇలాంటి గెటప్‌లో కనిపించబోతుండడం మామూలు విషయం కాదు, బన్నీ గట్స్‌కు హ్యాట్సాఫ్ అన్నారు. అందుకే… గంగమ్మ జాతర ఎపిసోడ్ సినిమాలో పీక్స్ అనేలా ఉంటుందని అంటున్నారు. మరి బన్నీ బాక్సాఫీస్ జాతరను చూడాలంటే… వచ్చే ఏడాది ఆగస్టు 15న వరకు వెయిట్ చేయాల్సిందే.