Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మధ్యనే బన్నీ.. నేషనల్ అవార్డు అందుకోవడంతో అందరి చూపు బన్నీపైనే ఉన్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ .. అల్లు అర్జున్ తో సినిమా తీయడానికి ఊవిళ్లూరుతున్నారు. ఇక ఎప్పటినుంచో జైలర్ తో హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్.. బన్నీ చుట్టూ ఒక కథ పట్టుకొని తిరుగుతున్నాడని వార్తలు వస్తున్నాయి. కథకుడా నేరేట్ చేసాడని, బన్నీ కి కూడా నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్ నడిచింది. ఇక దీంతో నెల్సన్.. ఓ రేంజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టొచ్చు అనుకున్నాడు. కానీ, ఇంతలోనే బన్నీ.. నెల్సన్ కు గట్టి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Rahul Sipliganj: ఛీ.. రతిక నిజ స్వరూపం ఇదా.. బండారం మొత్తం బయటపెట్టిన రాహుల్..?
ప్రస్తుతం పుష్ప 2 అయ్యాక.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు బన్నీ.. ఇది అయ్యాక.. నెల్సన్ సినిమా ఉంటుంది అని భావించాడు. అయితే ఈలోపే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. కథ మరింత నచ్చడంతో నెల్సన్ కు హ్యాండ్ ఇచ్చి సందీప్ ను లైన్లో పెట్టినట్లు సమాచారం. అంటే.. త్రివిక్రమ్ సినిమా తరువాత సందీప్ రెడ్డి సినిమా పట్టాలెక్కుతోంది. ఇక ఈలోపు ఖాళీగా ఉండకుండా.. నెల్సన్ ను మరో సినిమా చేసుకోమని బన్నీ సలహా కూడా ఇచ్చాడట. దీంతో నెల్సన్..ధనుష్ కు కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడని టాక్. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.