Rahul Sipliganj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై రెండు వారాలు దాటిపోయింది.. ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు కూడా వచ్చేశారు. మొదటినుంచి ఈ సీజన్ పై అభిమానులు ఆసక్తిని కనపరుస్తూనే వచ్చారు. ఇక అభిమానుల అంచనాలకు అందకుండా ఈసారి ఉల్టా.. పుల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేశాడు బిగ్ బాస్. అంతా సక్రమంగా నడుస్తున్న తరుణంలో ఇంట్లో కొంతమంది కంటెస్టెంట్స్ చేసే హంగామా.. ఓవర్ యాక్షన్.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా రతిక, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ గొడవలు చూడడానికి చాలా చిరాకుగా ఉన్నాయి. గతవారం రతిక చేసిన రచ్చ .. చేపల మార్కెట్ లో ఉన్నట్లు గట్టిగట్టిగా అరవడం.. ఇదంతా ఫేక్ గా ఆడుతున్నట్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక మనుషులను వాడుకొని రతిక సింపతీ క్రియేట్ చేస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మాజీ లవర్ ను గుర్తుచేసుకున్నట్లు ఏడవడం.. సింపతీ కోసం మనుషులను వాడుకోవడం ఇదంతాఫేక్ అని రతిక మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ ఆమె పేరు తీసుకురాకుండా చెప్పడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Manchu Lakshmi: మోహన్ బాబు ముద్దుల కూతురు అందాల ఆరబోత.. ఈ రేంజ్ లోనా
నిజానికి రాహుల్ కు బిగ్ బాస్ కొత్తేమి కాదు. బిగ్ బాస్ సీజన్ 3 లో రాహుల్ విన్నర్ గా నిలిచాడు. ఎవరు ఫేక్ ఆడుతున్నారు.. ఎవరు డ్రామాలు చేస్తున్నారు.. ఎవరు సింపతీ కోసం ఏడుస్తున్నారు అనేది ఇట్టే పసికట్టేయగలడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బిగ్ బాస్ లో సింపతీ చూపించి, పేర్లు వాడుకొని గేమ్ గెలవాలని చూస్తున్నారని రాహుల్ చెప్పుకొచ్చాడు. ” ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఎప్పుడూ అందరూ సొంత టాలెంట్‌తోనే పైకి రావాలనుకుంటారు. కొందరు మాత్రం పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. గుర్తింపు రావడం కోసం నా పేరు అవసరం కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టూ ఇన్నర్ పర్సన్. కంగ్రాచ్యూలేషన్స్ టూ వాళ్ల పైసల్ తీసుకున్న టీమ్” అంటూ రాసుకొచ్చాడు. రాహుల్ పేరు చెప్పకపోయినా.. ఇది ఖచ్చితంగా రతికను ఉద్దేశించే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చారు. రతిక వచ్చిన వారంరోజులకే ఒక్కత్తే కూర్చొని ఏడుస్తూ.. తల్లిదండ్రులు కాకుండా ఇంకెవరినో మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. అదుగో అక్కడ మొదలైంది. ఆ ఎవరు.. అంటే రాహుల్ అని ఆమె టీమ్ బయట సోషల్ మీడియాలో న్యూస్ క్రియేట్ చేసి వారి ఫోటోలను లీక్ చేసి.. సింపతీ పొందేలా ప్లాన్ చేశారు అని రాహుల్ ఉద్దేశ్యమని పొందారు అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.