Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లేడీస్ బన్నీ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. బన్నీకి పెళ్లి కాకముందు అమ్మాయిలు.. బన్నీనే పెళ్లాడడానికి చాలా ట్రై చేశారు. కానీ, అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి ప్రేమలో పడి.. అలా ఆమెకు సరెండర్ అయిపోయాడు. ఇక పెళ్ళికి ముందు అల్లు అర్జున్ కు ఒక పేరు ఉంది. టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అని పేరు ఉండేది. ప్రతి సినిమాలో ఆయనకు, హీరోయిన్ కు ఖచ్చితంగా ఒక లిప్ లాక్ అయినా ఉండాల్సిందే. ఇక పెళ్లి తరువాత స్నేహకు భయపడి తాను లిప్ లాక్స్ కు దూరంగా ఉంటున్నట్లు బన్నీ చాలాసార్లు చెప్పాడు. ఇకపోతే స్నేహ కన్నా ముందు ఐకాన్ స్టార్ కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఆ విషయాన్నీ స్వయంగా బన్నీనే అందరి ముందు చెప్పుకొచ్చాడు. ఈ మధ్య ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్స్ కు గెస్ట్ గా వెళ్లిన బన్నీ.. తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చాడు.
Niharika Konidela: మెగా డాటర్ ఈ రేంజ్ గా చూపించడానికి కారణం అదేనా..?
కంటెస్టెంట్స్ లో ఒకరైన శృతి.. అల వైకుంఠపురంలోని ఓ మై గాడ్ డాడీ అనే పాటను పాడి అల్లు అర్జున్ ఇంప్రెస్ చేసింది. ఇక ఆమె గురించి బన్నీ చెప్తూ.. ” నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటే నా మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతినే.. అయితే ఇప్పుడు చెప్పకూడదు.. నేను అసలే ఇంటికి వెళ్ళాలి.. మా ఆవిడ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటుంది” అంటూ నవ్వేశాడు. ఇక ఈ మాటకు గీత మాధురి మాట్లాడుతూ.. ” అదికాదు సర్ .. గర్ల్ ఫ్రెండ్ అని చివర్లో 1st క్లాస్, సెకండ్ క్లాస్ అనరు కదా ” అని అడుగగా.. లేదమ్మా.. అలా అయితే ఇంతలా సిగ్గు ఎందుకు పడతాను అంటూ నవ్వేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై బన్నీ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంటికెళ్లిన తరువాత బన్నీని స్నేహా .. ఎవరా..? ఆ శృతి అని అడుగుతుందని మీమ్స్ రూపం లో చెప్పుకొచ్చారు. ఇక మరికొందరు.. ఆహా , బన్నీ.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 లో నటిస్తున్నాడు.