స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 2024 సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవ్వనున్న పుష్ప ది రూల్ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంది పుష్ప 2 మూవీ. గ్లిమ్ప్స్ తోనే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన అల్లు అర్జున్-సుకుమార్ ఒక్కసారి టీజర్ ని బయటకి వదిలితే వ్యూస్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ పైగా ఎలాంటి లీక్స్ అండ్ అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా షూట్ చేస్తున్నారు కాబట్టి ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా డిజిటల్ రికార్డ్స్ చెల్లా చెదురు అవ్వడం పక్కా. ఎందుకంటే ఒకప్పుడు అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ కి, ఇప్పుడు అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ కి చాలా తేడా ఉంది.
సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ చేస్తున్న హంగామా చూస్తుంటే అల వైకుంఠపురములో సినిమా ముందున్న ఫ్యాన్స్ బేస్ కి ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ కి ఎంత వ్యత్యాసం ఉందో తెలిసిపోతుంది. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ హైదరాబాద్ తిరిగి రావడంతో ఎయిర్పోర్ట్ నుంచి బన్నీ ఫొటోస్ బయటకి వచ్చాయి. ఇటీవలే టుమారోల్యాండ్ కాన్సర్ట్ కోసం అల్లు అర్జున్ బెల్జియం వెళ్లాడు. కాన్సర్ట్ ముగించుకొని తిరిగొచ్చిన అల్లు అర్జున్ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో స్టైలిష్ గా కనిపించాడు. దీంతో ట్విట్టర్ లో #PushpaTheRule #AlluArjun టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.