Aaditi Aggarwal: అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి గుర్తుందా..? అందులో బన్నీ సరసన నటించిన బ్యూటీ అదితి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివంగత హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ చెల్లిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అనుకోకుండా ఒకరోజు ఆర్తీ, అదితి ఇద్దరు ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉండగా దర్శకేంద్రుడు అదితిని చూసి గంగోత్రికి హీరోయిన్ దొరికేసిందని చెప్పారట. అలా మొదటి సినిమాతో అల్లు అర్జున్, అదితి ఇద్దరూ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నదో అందరికి తెల్సిందే.
ఇక అక్క ఆర్తీ మరణం తరువాత న్యూయార్క్ లో సెటిల్ అయిపోయిన ఈ భామ ఇన్నాళ్లకు ఇదుగో ఇలా కనిపించింది. ఇటీవల బన్నీ న్యూయార్క్ వెళ్లడంతో మరోసారి గంగోత్రి పెయిర్ ఇలా దర్శనమిచ్చారు. అయితే అదితి అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఈ జంట ఇప్పుడే బావున్నారని, ఇద్దరు కలిసి గంగోత్రి పార్టీ 2 తీయొచ్చని చెప్పుకొస్తున్నారు. బ్లాక్ టాప్, రెడ్ స్కర్ట్ తో అదితి ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక్కసారిగా అదితిని చూసిన వారు ఆర్తీ అగర్వాల్ ను గుర్తు తెచ్చుకొంటున్నారు. ఒక అద్భుతమైన నటిని ఇండస్ట్రీ కోల్పోయిందని కామెంట్స్ చేస్తున్నారు.