కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. నాగ్ 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ నా సామిరంగ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పోరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమా ఆధారంగా నా సామిరంగ సినిమా రూపొందుతుంది. మాస్ లుక్ లో కనిపించనున్న నాగార్జున పక్కన అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నా సామిరంగ ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సాంగ్ “ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే”ని రిలీజ్ చేసారు. కీరవారి, చంద్ర బోస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సాంగ్ సోల్ ఫుల్ గా ఉంది.
Read Also: Pindam: ‘పిండం’ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది- హీరోయిన్ ఖుషీ రవి
ఇక నెక్స్ట్ నా సామిరంగ సినిమా నుంచి సాలిడ్ ప్రమోషనల్ కంటెంట్ రాబోతుంది. నా సామిరంగ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. ‘అంజగాడు’ అనే పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ కి సంబంధించిన అప్డేట్ ని మేకర్స్ రివీల్ చెయ్యబోతున్నారు. రేపు ఉదయం 10:18 నిమిషాలకి అంజిగాడు వస్తున్నాడు… నా సామిరంగ అంటూ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ అల్లరి నరేష్ లుంగీ కట్టుకోని విలేజ్ లుక్ లో చిల్ గా కనిపించాడు. ఈ మధ్య సీరియస్ రోల్స్ ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్, నా సామిరంగ సినిమాతో మళ్లీ ఆడియన్స్ ని నవ్వించేలా కనిపిస్తున్నాడు. మరి అంజిగాడు ఎలాంటి అప్డేట్ తో బయటకి వస్తాడో చూడాలి.
అంజి గాడు వస్తున్నాడు!! నా సామి రంగ 🔥
Meet Anji and his world tomorrow at 10:18 AM💥#NaaSaamiRanga #NSRForSankranthi
KING 👑 @iamnagarjuna @AshikaRanganath @vijaybinni4u @mmkeeravaani @srinivasaaoffl @SS_Screens @boselyricist @Dsivendra @ChotaKPrasad @JungleeMusicSTH pic.twitter.com/cZMtJ4gUVV
— Allari Naresh (@allarinaresh) December 14, 2023