12A Railway Colony : వివిధ జానర్లలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేశ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలతోనే సినిమా చుట్టూ మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది నాని కాసరగడ్డ. ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథను అందించారు. ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Also : Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!
కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్‌లో అల్లరి నరేశ్ కొత్తగా కనిపించారు — గతంలో చేసిన కామెడీ రోల్స్‌కు పూర్తిగా భిన్నంగా, సీరియస్ మరియు ఇంటెన్స్ పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థ్రిల్లింగ్ నేరేటివ్, సస్పెన్స్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా విభిన్నమైన అనుభూతిని ఇవ్వబోతోందని ట్రైలర్ సూచిస్తోంది. ఈ మూవీ నవంబర్ 21న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో నరేశ్ హిట్ కొడుతాడా లేదా చూడాలి.
Read Also : Betting Apps Case : సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ..