Betting Apps Case : హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. వారికి మళ్లీ రావాలని గతంలోనే సూచించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎలా అప్రోచ్ అయ్యారు.. డబ్బులు ఎలా తీసుకున్నారు, వాటిని ఏం చేశారు అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
Read Also : Payal Rajput : శృంగారం గురించి చెప్పడానికి సిగ్గెందుకు.. బోల్డ్ హీరోయిన్ కామెంట్స్
విజయ్ తో పాటు ఇప్పటికే ప్రకాశ్ రాజ్, రానా, మంచు లక్ష్మీలకు కూడా నోటీసులు వెళ్లాయి. త్వరలోనే మరింత మందిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ అప్పట్లో కొన్ని నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కానీ ప్రభుత్వం గుర్తించిన వాటిని మాత్రమే విజయ్ ప్రమోట్ చేశాడని ఆయన టీమ్ చెప్పింది. విజయ్ వాటిని ప్రమోట్ చేయడం ఎప్పుడో ఆపేశానని.. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ను నమ్మొద్దంటూ గతంలోనే కోరాడు.
Read Also : Prabhas : ప్రభాస్ సెంటిమెంట్ దుల్కర్ కు కలిసొస్తుందా..?