జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఈ నెల 18న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. బుధవారం హైదరాబాద్‌లో తారకరత్న పుట్టిన రోజు నాడు, ఆయన చిన్న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఏడుస్తున్న విజువల్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఉన్నాయి. చిన్న కర్మ అయిపోయిన తర్వాత అలేఖ్య రెడ్డి, తారకరత్న గురించి ఇన్స్టాలో చేసిన పోస్ట్ చాలా ఎమోషనల్ గా ఉంది.
Read Also: Taraka Ratna: కొడుకుని చూసి తల్లడిల్లుతున్న తారకరత్న తల్లిదండ్రులు
https://www.instagram.com/p/Co9mPo5qPdQ/
తారకరత్న, తన కూతురు నిష్కతో ఉన్న ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ…‘‘నా జీవితంలో ఉత్తమ తండ్రి, ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త, మంచి మనసున్న వ్యక్తివి. హ్యాపీ బర్త్ డే.. నిన్ను చాలా మిస్సవుతున్నాం’’ అంటూ అలేఖ్య రెడ్డి భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ప్రతి ఒక్కరినీ బాధ పెడుతుంది. చిన్న వయసులో మరణించిన తారకరత్న లేని లోటు ఆ కుటుంబానికి, సరిగ్గా ఊహ కూడా తెలియని ముగ్గురు పిల్లలకి, భర్తే ప్రపంచంగా బ్రతికిన అలేఖ్య రెడ్డికి ఎప్పటికీ తీరదు.
Read Also: Nandamuri Tarakaratna: అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి