అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని. ప్రిన్స్ లా ఉండే అఖిల్, తన డెబ్యు కన్నా ముందే మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచి వచ్చినా మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో హ్యుజ్ ప్రెజర్ ని ఫేస్ చేశాడు. ‘అఖిల్’ మూవీ ఫ్లాప్ అవ్వడంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోని, అక్కినేని ఫ్యామిలీకి ట్రేడ్ మార్క్ లాంటి లవ్ స్టొరీతో రీలాంచ్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్ల గ్యాప్ తో మూడో సినిమా, మళ్లీ రెండేళ్ల గ్యాప్ తో నాలుగో సినిమా… ఇలా గ్యాప్ తీసుకోని సినిమాలు చేస్తున్న అఖిల్ తన లాస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. జీరో కాంట్రవర్సీలతో, తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే అఖిల్ ఈసారి మళ్లీ రెండేళ్ల గ్యాప్ ఇచ్చి ‘ఏజెంట్’ సినిమాతో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు.
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఏజెంట్ మూవీ చిన్న గ్లిమ్ప్స్ తోనే అందరినీ ఇంప్రెస్ చేసింది. ఏజెంట్ మూవీ అఖిల్ ని పాన్ ఇండియా స్థాయిలో మంచి లాంచ్ అవుతుందని మేకర్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రమోషన్స్ చెయ్యాలి అప్పుడే మార్కెట్ క్రియేట్ అవుతుంది. అఖిల్ ఏమో ఇంట్రోవర్ట్, ఎక్కువగా బయట కనిపించడు, మాట్లాడాడు… కామ్ గా ఉంటాడు. ఇలాంటి టైంలో ముందు అఖిల్ తెలుగులో బయటకి రావడం మొదలుపెట్టాలి. ఇక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. పుష్ప రిలీజ్ కి ముందు అల్లు అర్జున్, చాలా సినిమాల ఫంక్షన్స్ కి గెస్టుగా వెళ్లాడు. తరచుగా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇదే ఫాలో అవుతున్న అఖిల్, కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి బయటకి వస్తున్నాడు.
ఈరోజు గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ని అఖిల్ గెస్టుగా వస్తున్నాడు. ఇలా అఖిల్ వీలైనంత ఎక్కువగా ఆడియన్స్ తో టచ్ లో ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడి నుంచి ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని అఖిల్, ఫాన్స్ లోకి తీసుకోని వెళ్లాలి. అక్కినేని అభిమానులు మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి రావాలి. అది అఖిల్ మాత్రమే చెయ్యగలడు. అందుకే ట్విట్టర్ లో అఖిల్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అఖిల్ ఇలా చెయ్యడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 22న అఖిల్ ట్విట్టర్ స్పేస్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వనున్నాడు. ఈ స్పేస్ అయిపోయే సరికి అక్కినేని ఫాన్స్ జోష్ లోకి వచ్చేస్తే ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో అసలైన కిక్ స్టార్ట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యే ఈ ప్రమోషన్స్ జోష్, పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అప్పుడే అఖిల్ కి ఏజెంట్ సినిమా మంచి ఓపెనింగ్స్ ని తెస్తుంది.
#VinaroBhagyamuVishnuKatha Grand Pre-Release event on FEB 16 at People's Plaza, Necklace Road! ✨@AkhilAkkineni8 to grace the event as chief guest 🤩#AkhilForVBVK 😎#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @adityamusic pic.twitter.com/Lhuskg2vvj
— GA2 Pictures (@GA2Official) February 14, 2023
A K K I N E N I FANS 😎
Get ready for a thrilling space session with our #AGENT 💥Join @AkhilAkkineni8 in his FIRST EVER TWITTER SPACE INTERACTION with fans on FEBRUARY 22nd 🔥
For more exciting details!
Stay Tuned🤘@AKentsOfficial pic.twitter.com/QVdW1Ac6kX— AK Entertainments (@AKentsOfficial) February 15, 2023