గత ఏడాది టాలీవుడ్ లో “అఖండ” అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరోమారు నందమూరి బాలకృష్ణ ఈజ్ బ్యాక్ అనిపించేలా థియేటర్లలో ‘అఖండ’ జాతర జరిగింది. ఈ కరోనా మహమ్మారి సమయంలో ‘అఖండ’ హిట్ టాలీవుడ్ కు ధైర్యాన్ని అందించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటిటిలోనూ ‘అఖండ’ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల ఈ సంచలన హ్యాట్రిక్ చిత్రం ఇప్పటికీ ఓటిటిలో మంచి వ్యూస్ అందుకుంటోంది. ఇప్పుడు అదే జోరును కోలీవుడ్ బిగ్ స్క్రీన్స్ పై కొనసాగించడానికి ‘అఖండ’ రెడీ అయ్యాడు.
Read Also : ‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు
ఈ యాక్షన్ డ్రామా చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ రేపు థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. ప్రస్తుతం అక్కడ పెద్దగా రిలీజ్‌లు లేకపోవడంతో ఈ బ్లాక్‌బస్టర్ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ పవర్-ప్యాక్డ్ మూవీని ఇతర భాషలలో కూడా తన ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తుందని కూడా వినికిడి. ఏదేమైనా ‘అఖండ’ హవా ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు.