గత ఏడాది టాలీవుడ్ లో “అఖండ” అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరోమారు నందమూరి బాలకృష్ణ ఈజ్ బ్యాక్ అనిపించేలా థియేటర్లలో ‘అఖండ’ జాతర జరిగింది. ఈ కరోనా మహమ్మారి సమయంలో ‘అఖండ’ హిట్ టాలీవుడ్ కు ధైర్యాన్ని అందించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటిటిలోనూ ‘అఖండ’ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల ఈ సంచలన హ్యాట్రిక్ చిత్రం ఇప్పటికీ ఓటిటిలో మంచి వ్యూస్ అందుకుంటోంది. ఇప్పుడు అదే జోరును కోలీవుడ్ బిగ్…