Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. అజిత్ కేవలం హీరోనే కాదు ఒక రేసర్ కూడా. కొద్దిగా టైమ్ దొరికినా కూడా బైక్ తీసుకొని రేస్ లకు వెళ్ళిపోతాడు. ఇక ఈ మధ్య వరల్డ్ టూర్ వెళ్లి వచ్చిన అజిత్.. సడెన్ గా హాస్పిటల్ లో కనిపించాడు. దీంతో అతనికి ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు అజిత్ కు ఏమైంది.. ?అంటే .. అతను కేవలం నార్మల్ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో అభిమానులు భయపడడానికి ఏమి లేదని చెన్నై మీడియా తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం అజిత్ ఆరోగ్యంగానే ఉన్నాడని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అజిత్ కెరీర్ విషయానికొస్తే.. గత కొంతకాలంగా అజిత్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నిజం చెప్పాలంటే.. అజిత్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. వలిమై తరువాత తునీవు చేశాడు. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. ఇక ఈ రెండు సినిమాల తరువాత అజిత్ నటిస్తున్న తాజా చిత్రం విదా ముయార్చి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతోనైనా అజిత్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.