దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, విడుదల చేయాలన్నది జక్కన్న ఆలోచన. అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. అయితే మహేష్ బాబుతో రాజమౌళి మూవీ ఉంటుందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ తాజా సమాచారం ప్రకారం రాజమౌళి “ఆర్ఆర్ఆర్”ను పూర్తి చేసి ఓ బాలీవుడ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. మరి మహేష్ మూవీ సంగతి ఏంటి ? అనే సూపర్ స్టార్ అభిమానులు ప్రశ్నించొచ్చు. అయితే మహేష్ తో కూడా రాజమౌళి సినిమా ఉంది. కానీ దానికి టైం ఉంది.
Read Also : “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ?
మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జనవరిలో రానుంది. ఈ మూవీ అనంతరం మహేష్ కొంచం గ్యాప్ తీసుకుంటాడు. ఆ గ్యాప్ ను రాజమౌళి వాడుకోవాలని చూస్తున్నారట. చిన్న కథతో, స్టార్స్ హడావుడి లేకుండా మూడు నెలల్లోనే సినిమా మొత్తాన్ని పూర్తి చేసి విడుదల చేయాలనేది రాజమౌళి ప్లాన్ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆ తరువాత మహేష్ బాబు, రాజమౌళి భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది అంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడూ ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను అలరించాలన్నది రాజమౌళి ఆలోచన. అయితే ఈ సినిమాకు రాజమౌళి స్వయంగా దర్శకత్వం వహిస్తారా? లేదంటే కేవలం దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారా ? అనేది తెలియాల్సి ఉంది.